Sita Ramam review గుండెను పిండేసే ప్రేమకథ.. ఉద్వేగానికి గురిచేసే దేశభక్తి నేపథ్యంగా | Sita Ramam review and rating: Hanu Raghavapudi flawless writing makes epic and classic love story

Trends

సీతారామం కథ ఏమిటంటే..

సీతారామం కథ ఏమిటంటే..

ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ ఆఫీసర్ రామ్ (దుల్కర్ సల్మాన్). అనాధగా ఉండే రామ్‌కు భార్యను అంటూ సీత (మృణాల్ థాకూర్) ఉత్తరం రాస్తుంది. దాంతో తనను ప్రేమిస్తున్న సీతను వెతుక్కుంటూ రామ్ వెళ్తాడు. సీతను కలిసిన తర్వాత రామ్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలు వారిని విడిపోయేలా చేస్తుంది.

సీతారామంలో ట్విస్టులు

సీతారామంలో ట్విస్టులు

అయితే రామ్, సీత కలుసుకొన్నారా? రామ్ ప్రేమను సీత అంగీకరించిందా? వారి ప్రేమకు అడ్డుపడిన సంఘటన ఏమిటి? రామ్ రాసిన చివరి ఉత్తరాన్ని సీతకు చేర్చేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఆఫ్రీన్ (రష్మిక మందన్న) ఎందుకు ప్రయత్నించింది. రామ్‌కు ఆఫ్రీన్‌కు ఉన్న సంబంధం ఏమిటి? చివరకు రామ్, సీత ప్రేమ కథకు ముగింపు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమే సీతారామం.

ఫస్టాఫ్‌ నిదానంగా.. తాపీగా

ఫస్టాఫ్‌ నిదానంగా.. తాపీగా

లండన్‌లో భారతీయులకు, పాకిస్థాన్‌ స్టూడెంట్స్ మధ్య జరిగే గొడవలతో సీతారామం కథ చాలా ఎమోషనల్‌గా ప్రారంభం అవుతుంది. ఈ గొడవల్లో ఆఫ్రీన్ (రష్మిక) చేసిన తప్పుకు అక్కడి యూనివర్సిటీ అధికారులు ఆమెను కాలేజ్ నుంచి సస్పెండ్ చేయడంతో కథ మలుపు తిరుగుతుంది. రామ్ రాసిన లేఖను తన తాత (సచిన్ ఖేడ్కర్) ఇవ్వడంతో దానిని సీతకు చేర్చేందుకు ఆఫ్రీన్ సిద్దమవుతుంది. సీతను వెతుక్కొంటూ వెళ్లడంతో కొంత సాగదీసినట్టు అనిపిస్తుంది. కాకపోతే భావోద్వేగంతో కూడిన సన్నివేశాలు హృదయానిక హత్తుకునేలా ఉంటాయి. అయితే సీత గురించిన మంచి ట్విస్ట్‌తో ఫస్టాఫ్‌ ఎమోషనల్‌గా ముగుస్తుంది.

సెకండాఫ్ ఎమోషనల్‌గా

సెకండాఫ్ ఎమోషనల్‌గా

ఇక సెకండాఫ్‌లో కథ సాధారణ ప్రేక్షకుడికి అందనంతగా మలుపులు తిరుగుతూ థ్రిల్‌కు గురిచేస్తుంది. సెకండాఫ్‌లో ప్రతీ ఎపిసోడ్ అద్భుతంగా ఉంటుంది. సీతతో రామ్ రాజమండ్రి ప్రయాణం, వరంగల్ ఎపిసోడ్ గుండెను కుదిపేస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌కు ముందు నుంచి సాగే కథ ప్రేక్షకుడి హృదయాన్ని కలిచే వేసేలా ఉంటుంది. రామ్, సీత ఒక అద్బుతమైన నోట్‌తో ముగియడంతో ఫీల్‌గుడ్‌గా మారుతుంది. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన ప్రతీ ప్రేక్షకుడిని పాత్రలు, సన్నివేశాలు వెంటాడటం ఖాయం.

హృదయాన్ని పిండేసిన హను రాఘవపూడి

హృదయాన్ని పిండేసిన హను రాఘవపూడి

దర్శకుడు హను రాఘవపూడి‌ సినిమా అంటే కొన్ని సందేహాలు, అనుమానాలు ఉంటాయి. కానీ సీతారామం లాంటి చాలా పెద్ద కథను అద్బుతంగా ఎలాంటి తొణుకు బెణుకు లేకుండా ఆద్యంతం హృదయాన్ని పిండేసేలా హను రాఘవపూడి చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అనేక లేయర్స్ ఉన్న కథను బ్లెండ్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ చెప్పాలి. కథా పరంగా కమర్షియల్ అంశాలకు దూరంగా ఉంటూనే.. పక్కా కమర్షియల్ సినిమాను అందించడం హను ప్రతిభకు అద్దం పట్టింది. డైలాగ్స్, స్క్రీన్ ప్లే అద్బుతంగా రాసుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. హను రాఘవపూడి అందమైన ప్రేమకథనే కాదు.. దేశభక్తిని చాటే సినిమాను అందించడానే చెప్పవచ్చు.

వావ్ దుల్కర్, మృణాల్

వావ్ దుల్కర్, మృణాల్

నటీనటులు ప్రతిభ విషయానికి వస్తే.. ప్రతీ ఒక్కరు మాస్టర్, క్లాస్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. దుల్కర్ సల్మాన్ నటన, హావభావాలు, యాటిట్యూడ్ అద్బుతంగా ఉన్నాయి. లవర్ బాయ్‌గా, సైనికుడిగా, దేశం కోసం ప్రాణాలకు తెగించే సోల్చర్‌గా, మానవత్వం ఉన్న సాధారణ పౌరుడిగా రకరకాల షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు. ఇక సీతగా మృణాల్ థాకూర్ అద్బుతంగా తెరపైన కనిపించింది. సీత పాత్రకు సంబంధించిన మరో కోణం సినిమాను మరో మెట్టు ఎక్కించింది. భారమైన పాత్రను చాలా హుందాగా అందర్ని మెప్పించేలా చేసింది.

రష్మిక పెర్ఫార్మెన్స్ ఓ మ్యాజిక్

రష్మిక పెర్ఫార్మెన్స్ ఓ మ్యాజిక్

ఇక రష్మిక విషయానికి వస్తే.. ఆఫ్రీన్ పాత్రలో మ్యాజిక్ చేసిందనే చెప్పవచ్చు. ఆఫ్రీన్‌పై కొంత కోపం, మరికొంత జాలి, ప్రేమ కలిగించేలా రష్మిక తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నది. రష్మిక కెరీర్‌లో ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. బాలాజీ పాత్రలో దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. తరుణ్ భాస్కర్ మెచ్యురిటీతో తన పాత్రను పండించాడు. వెన్నెల కిషోర్ కామెడీని పండించాడు. ఇక సుమంత్ విషయానికి వస్తే.. విష్ణు శర్మగా మరో రేంజ్‌లో కనిపించాడు. ఇంకా చాలా పాత్రల గురించి చదివి తెలుసుకోవడం కంటే తెరమీద చూసి ఆస్వాదించాల్సిందే.

టెక్నికల్ విభాగాల పనితీరు

టెక్నికల్ విభాగాల పనితీరు

సీతారామం సినిమాకు మ్యూజిక్ ప్రాణంగా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సందర్బోచితంగా వచ్చే పాటలు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక పీఎస్ వినోద్ అందించిన సినిమాటోగ్రఫి మరో మ్యాజిక్. మంచు కొండలను, కాశ్మీర్ అందాలను బ్యూటీఫుల్ పెయింటింగ్‌ను తలపించేలా చేశాడు. అసాధారణమైన కథ, అనేక మలుపులు, ట్విస్టులతో కూడా కథనాన్ని అందించడం కత్తిమీద సామే. కానీ ఆ పనిని ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు చాలా చాకచక్యంగా చూపడమే కాదు.. తన ప్రతిభ ఏంటో మరోసారి చూపించాడు. సాంకేతిక విభాగాలన్నీ అద్బుతంగా అవుట్‌పుట్ ఇచ్చాయి.

ప్రొడక్షన్ వ్యాల్యూస్

ప్రొడక్షన్ వ్యాల్యూస్

సీతారామం లాంటి కథను టచ్ చేయడమే ఓ సాహసంలా కనిపిస్తుంది. స్క్రిప్టులో ఉండే నిజాయితీని తెర మీదకు తీసుకు రావడానికి చేసిన ప్రయత్నం వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా అభిరుచికి అద్దం పట్టింది. ప్రతీ ఫ్రేమ్ ఓ క్యాన్వాస్‌లా కనిపించేందుకు అనుసరించిన నిర్మాణ విలువలు ఈ సినిమాను క్లాసిక్‌గా మార్చాయి. ఏ దశలోను రాజీలేని పంథాను నిర్మాతలు అనుసరించారని సినిమా చెప్పింది.

ఫైనల్‌గా

ఫైనల్‌గా

మంచి డైలాగ్స్, పాటలు, పర్‌ఫెక్ట్ ఎమోషన్స్‌తో కూడిన ప్రేమ కథా చిత్రం సీతారామం. ఈ కథ లార్జర్ ద్యాన్ లైఫ్. నటీనటులు ఫెర్ఫార్మెన్స్, దర్శకుడు హాను రాఘవపూడి టేకింగ్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. అందమైన లొకేషన్లు, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమా క్వాలిటీ, కంటెంట్‌ను బలంగా చెప్పగలిగాయి. ప్రేమ, దేశభక్తిని మిళితం చేసి అద్బుతమైన చిత్రంగా రూపుదిద్దుకొన్నది. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమాను మిస్ చేసుకొంటే.. ఓ అందమైన దృశ్యకావ్యాన్ని మిస్ చేసుకొన్నట్టే.. డొంట్ మిస్.. మస్ట్ వాచ్ మూవీ.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

ప్లస్ పాయింట్స్
దుల్కర్, మృణాల్, రష్మిక పెర్ఫార్మెన్స్
హను రాఘవపూడి టేకింగ్
పాటలు, డైలాగ్స్
ప్రొడక్షన్ వ్యాల్యూస్
విజువల్స్

మైనస్ పాయింట్
స్లో నేరేషన్

సీతారామంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

సీతారామంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

నటీనటులు: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, భూమిక చావ్లా ప్రకాష్ రాజ్ తదితరులు
దర్శకత్వం: హను రాఘవపూడి
నిర్మాత: అశ్వినీదత్
బ్యానర్: స్వప్న సినిమా
సమర్పణ: వైజయంతీ మూవీస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గీతా గౌతమ్
ఛాయాగ్రహణం: పీఎస్ వినోద్
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడక్షన్ డిజైన్: సునీల్ బాబు
ఆర్ట్ డైరెక్టర్: వైష్ణవి రెడ్డి, అలీ
కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
పీఆర్వో: వంశీ-శేఖర్
రిలీజ్ డేట్: 2022-08-05

https://telugu.filmibeat.com/reviews/sita-ramam-review-and-rating-hanu-raghavapudi-flawless-writing-makes-epic-and-classic-love-story-111899.html